Site icon NTV Telugu

S*exual Assault: 13 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల ఆలయ పూజారి లైంగిక వేధింపులు

Tb

Tb

S*exual Assault: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కుంభకోణం సమీపంలోని ఒక ఆలయం లోపల 13 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ఆలయ పూజారి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడిపై పోక్సో చట్టం కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే, హిందూ మతపరమైన- ఛారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) విభాగం నియంత్రణలో ఉన్న తిరువాలంచుజిలోని ఒక ఆలయంలో గత నెలలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు విశ్వనాథ అయ్యర్, అనేక సంవత్సరాలుగా ఆలయ ప్రధాన పూజారిగా పని చేస్తున్నాడు. అయితే, సెప్టెంబర్ 8వ తేదీన 13 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి ఆలయానికి దర్శనం కోసం వచ్చింది. ఆమె ఒంటరిగా హుండీ (నైవేద్య పెట్టె) ప్రాంతానికి నైవేథ్యం సమర్పించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ వృద్ధ పూజారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Read Also: Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..

ఇక, బాధిత బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ తర్వాత, ఆరోపణలు నిజమని తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆ 75 ఏళ్ల ఆలయ ప్రధాన పూజారిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.

Exit mobile version