Site icon NTV Telugu

బాలికపై వాలంటీర్ దారుణం.. ఏకంగా గ్రామ సచివాలయంలోనే నీచం

కామాంధులు రోడురోజుకు పేట్రేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ..చిన్నారులను కూడా వదలకుండా చిదిమేస్తున్నారు. తాజాగా ఒక గ్రామ వాలంటీర్, ఒక బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. . వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో బొత్స హరిప్రసాద్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. సచివాలయం ఆదివారం మూసివేయాలి.. కానీ, హరిప్రసాద్ మాత్రం సచివాలయాన్ని తెరిచి పాడుపనులు చేస్తున్నాడు. గత నెల 31 వ తేదీన ఒక బాలికను మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకొచ్చాడు. అదేసమయలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాంబాబు హరిప్రసాద్ కు సహకరించాడు.బాలికను, అతనిని గదిలో తాళం పెట్టి బయటికి వెళ్ళిపోయాడు.

బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన హరి ప్రసాద్ కొద్దిసేపటి తరువాత బాలికను తన ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆరోజు బాలిక కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ఎవరికి ఈవిషయం తెలియలేదు. అనంతర, కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి బాలిక తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించింది. విషయం ఏంటా అని ఆరా తీయగా విషయం బయటికి వచ్చింది. వాలంటీర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు.

Exit mobile version