Site icon NTV Telugu

అర్ధరాత్రి గదిలో ఆ పని చేసిన బాలుడు.. షాక్ లో కుటుంబ సభ్యులు

ఈతరం పిల్లలకు ఎక్కువగా ఫోన్లతోనే గడుపుతున్నారు. గేమ్స్, వీడియోస్ అంటూ నిత్యం ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ కరోనా వలన చదువు కూడా ఆన్ లైన్ కావడంతో తల్లిదండ్రులు సైతం స్మార్ట్ ఫోన్ ని పిల్లల చేతికి ఇవ్వక తప్పడం లేదు. కొంతమంది పిల్లల విషయంలో అదే వారు చేస్తున్న పెద్ద తప్పు.. తాజాగా ఒక 14 ఏళ్ల బాలుడు తనకు తల్లిదండ్రులు చదువు కోసం కొనిచ్చిన ఫోన్ ని గేమ్స్ కోసం వాడాడు.. చివరికి గేమ్ లో ఓడిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. జోధ‌పూర్‌కు చెందిన సౌరభ్‌ (16) పదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్స్ మూతపడడంతో ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు అతడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో సౌరభ్‌ చదువును పక్కన పెట్టి ఫోన్ లో రేస్ గేమ్ అలవాటు పడ్డాడు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఆ గేమ్ లోనే మునిగి తేలేవాడు. తమ కుమారుడు ఈ ఏడాది పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉన్నందున అతడి తల్లిదండ్రులు సౌరబ్ కోసం మేడపైన ఓ గదిని ఏర్పాటు చేయడంతో పైన కొడుకు ఏం చేస్తున్నాడో కింద ఉన్న పేరెంట్స్ కి తెలిసేది కాదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భోజనం చేయడానికి తమ్ముడిని పిలిచుకురా అని అక్కకు తల్లి చెప్పడంతో ఆమె పైకి వెళ్లి తమ్ముడిని పిలిచింది. యెంత సేపటికి లోపలినుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో తొంగిచూడగా భయంకరమైన ఘటన కనిపించింది. ఉరి వేసుకుని సోదరుడు విగత జీవిగా వేలడుతుండటంతో కేకలు పెట్టింది. సౌరభ్‌ ఫోన్ లో కారు రేస్ కి సంబంధించిన వీడియోలు ఉండడంతో గేమ్ లో ఓటమి పాలవ్వడంతోనే బాలుడు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version