Maharashtra: మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. మహారాష్ట్రలో 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిననట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్
నిందితులు మైనర్ బాలికను సెప్టెంబర్ 02న తెల్లవారుజామున నల్లా సోపారా లోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక తల్లి సెప్టెంబర్ 06న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు రాహుల్ గెండే (41), షాహు అలియాస్ లంబు (35)లపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) కింద సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. నేరం జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలిక కుటుంబీకులు తమ వద్దకు ఎందుకు వచ్చారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.