రివ్యూ : `సామాన్యుడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడుదల తేదీ: ఫిబ్రవరి 4
జానర్: యాక్షన్ థ్రిల్లర్
నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, మారిముత్తు, తులసి, రాజా, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్, రవీనా రాజ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కావిన్ రాజ్
నిర్మాత: విశాల్
రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్
గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో వెనుకబడిపోయాడు విశాల్. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా తు.పా. శరవణన్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘వీరమే వాగై సూడుమ్’. దీనిని తెలుగులో ‘సామాన్యుడు పేరుతో విడుదల చేశారు. శుక్రవారం ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. నిర్మాతగాను, హీరోగాను ఈ సినిమా విజయం విశాల్ కి ఎంతో కీలకం. మరి ‘సామాన్యుడు’గా విశాల్ ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.
Also Read
‘సామాన్యుడు’ అన్న టైటిల్ జనాన్ని ఆకట్టుకునేదే. ఎందుకంటే కోట్లాది జనాల్లో అత్యధికులు సామాన్యులే. 2006లో జగపతిబాబు ‘సామాన్యుడు’గా జనం ముందు నిలచి జనం మది గెలిచే ప్రయత్నం చేసి కొంత వరకూ సఫలీకృతుడు అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్ తో విశాల్ ‘సామాన్యుడు’గా ప్రేక్షకుల ముందు నిలిచాడు. ‘Not a Common Man’ అనేది ఈ సినిమా ట్యాగ్.
ఇందులో కథానాయకుడు సామాన్యుడు. అంటే ఓ మధ్య తరగతివాడు. సబ్ ఇన్ స్పెక్టర్ కావాలన్నది తనతో పాటు తండ్రి(మారిముత్తు) కోరిక. తల్లి (తులసి), చెల్లి (రవీనా రావి)తో కలసి బతికే పోరస్ (విశాల్) సొసైటీలో జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలని భావిస్తుంటాడు. అయితే తండ్రి మాత్రం నేరం చేసే వారిని అడ్డుకోవడం కోసం చేసే నేరం కూడా ఇన్ స్పెక్టర్ కావాలనే కొడుకుకి ప్రతిబంధకంగా మారుతుందని చెబుతూ వస్తాడు. ఈ నేపథ్యంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల జనం పడే ఇబ్బందులు తెలియచేయటమే కాకుండా సొసైటీ ముందుంచే ప్రయత్నం చేస్తుంటాడు ఇలంగో కుమరవేల్. అది ఎం.పి కావాలని కలలు కనే ఆ ఫ్యాక్టరీ ఓనర్ నీలకంఠం(బాబూరాజ్) కి ప్రతిబంధకంగా మారుతుంది. దాంతో కుమరవేల్ ను హత్య చేస్తాడు నీలకంఠం. దానిని కళ్ళారా చూసిన హీరో చెల్లెలుకి ఎలాంటి గతి పడుతుంది. హీరో పోలీస్ కాకముందే తన చెల్లెలి హత్యను ఛేదించటానికి ఏం చేశాడు. చివరికి దుండుగులను పట్టుకుంటాడా? పోలీస్ గా మారతాడా? అన్నదే కథాంశం.
ఒకప్పుడు పోలీస్ ఉద్యోగం అంటే గౌరవంతో కూడుకున్నది. ఇప్పుడు పోలీస్ అంటే జనం భయపడేలా ఉందని కమెడియన్ యోగిబాబుతో చెప్పకనే చెప్పించారు. విశాల్ నటించి, నిర్మించిన ఈ చిత్రంలో ఆయన సరసన డింపుల్ హయాతి నాయికగా నటించింది. విశాల్ కు ఖాకీ పాత్రలు కొత్తేమీ కాదు. సో రొటీన్ గా సాగిపోతుంది తన పాత్ర. హీరో స్నేహితుడుగా నటించిన యోగిబాబుకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. హీరోయిన్ గా డింపుల్ హయతి పాత్రకి అంత ప్రాధాన్యత లేదు. ప్రథమార్ధంలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే పది నిముషాలు తప్ప మిగతాదంతా భరించటానికి ఎంతో ఓపిక కావాలి. దర్శకుడు సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఎంతో అమెచ్యూర్ గా ఉంది. విశాల్ నటించటమే కాదు, నిర్మాతగా కూడా ఎలా ఒప్పుకున్నాడన్నది అర్థం కాని విషయం. ఇక ద్వితీయార్థంలో చెల్లెలి మరణాన్ని ఎలా ఛేదించాడన్నది కొంత వరకూ ఆసక్తికరంగా అనిపించినా సాగదీతగా అనిపించక మానదు. డు ఆర్ డై సిట్యుయేషన్ లో విశాల్ చేయవలసిన సినిమా కాదు. ఇక కెరీర్ ఆరంభంలో ఎంతో యాక్టీవ్ గా ఉన్న విశాల్ రాను రాను ఎదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లుగా ఉంది. సినిమాలో ఒకే ఒక పాట ఉంది. శ్రీమణి రాసిన ఈ మాంటేజ్ సాంగ్ ‘మత్తెక్కించే కళ్ళే…’ పర్వాలేదనిపిస్తుంది. సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని మాత్రం చెప్పలేం. అయితే యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ఆయువు పట్టు అనే చెప్పాలి. `’రైజ్ ఆఫ్ ఏ కామన్ మేన్…’ థీమ్ మ్యూజిక్ బాగుంది. కెవిన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఒక నేరస్థుడు ఎలా పుడతాడు? తనను కాపాడేవాడు ఒకడున్నాడు అన్న ధీమా ఉన్నప్పుడే’, ‘ఎలుకను తరిమే పాము ప్రమాదమైందా? పామును తరిమే ఎలుక ప్రమాదమైందా? పాముకున్న ఆకలి ఎలుక మాత్రమే. కానీ ఎలుక ఆకలి పొలం మొత్తం…’, ‘నేనొక సామాన్యుణ్ణి. ఎదురు తిరగక పోతే నన్నూ చంపేస్తారు’ వంటి డైలాగ్స్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి. చాలా సన్నివేశాల చిత్రీకరణలో పాతదనమే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా విశాల్ హిట్ కోసం మరో సినిమా దాకా వేచి చూడక తప్పదు.
ప్లస్ పాయింట్స్:
విశాల్ యాక్షన్ మూవీ కావడం
కెవిన్ కెమేరా పనితనం
మైనస్ పాయింట్స్
ఆక్టటుకోని కథనం
తేలిపోయిన యోగిబాబు కామెడీ
సన్నివేశాల చిత్రీకరణలో సాగతీత
రేటింగ్: 2.25
ట్యాగ్ లైన్: అతి ‘సామాన్య’ చిత్రం!
తాజావార్తలు
-
Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
-
Rajni – Kamal Haasan : రజనీకాంత్, కమల్ హాసన్‌తో సినిమా అంటే దర్శకులకు తలనొప్పి తప్పదా
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!