England Fans Boos Australia for Jonny Bairstow’s Controversial Run-out in Ashes 2023: లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ 2023 రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన విధానం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దాంతో ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ అభిమానులతో పాటుగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసీస్ తెరుపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అదే పాత ఆస్ట్రేలియా.. ఎప్పుడూ మోసం’, ‘ఆస్ట్రేలియా చీటింగ్ అలవాటే గా’, ఆస్ట్రేలియా పెద్ద చీటర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
52వ ఓవర్ చివరి బంతిని ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్.. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు లెఫ్ట్ సైడ్ వేశాడు. క్రీజులో ఉన్న బెయిర్‌స్టో.. ఆ బంతి బౌన్స్ అవుతుందని భావించి ఆడకుండా కిందికి వంగాడు. దీంతో బంతి బెయిర్‌స్టో మీదుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఓవర్ ముగిసిందని భావించిన బెయిర్‌స్టో.. వెంటనే క్రీజులోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు విసిరాడు. స్టంప్స్ కింద పడగానే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీలు చేశారు. దాంతో బెయిర్‌స్టో ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయ్యాడు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఏ నిర్ణయం ఇవ్వాలో తెలియని లెగ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. దీంతో జానీ బెయిర్‌స్టోతో పాటు క్రీజులో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఇంగ్లండ్ ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు ఏం జరుగుతుందో తెలియక కొంతసమయం గందరగోళానికి గురయ్యారు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో బెయిర్‌స్టో సహా ఇంగ్లండ్ ప్లేయర్స్ అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇక చేసేదిలేక బెయిర్‌స్టో నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. ఇందుకుసంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అందరూ ఆస్ట్రేలియా ఆటపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఓవర్ పూర్తి అయిన తర్వాత క్రీజు వదిలే ముందు అంపైర్‌కు గానీ, కీపర్‌కు గానీ బ్యాటర్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఓవర్ పూర్తి అయినట్లు భావిస్తారు. ఈ సందర్భంలో జానీ బెయిర్‌స్టో తన కాలితో క్రీజులో ఓ గీత గీసేసి.. ముందుకు వెళ్ళిపోయాడు. ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే బెయిర్‌స్టోను థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. ఇక కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన బెయిర్‌స్టో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లీష్ ఓటమికి కారణమయ్యాడు.
Also Read: Mexico: మొసలిని పెళ్లి చేసుకున్న మెక్సికో మేయర్.. ఎందుకో తెలుసా?
🤐🤐🤐#EnglandCricket | #Ashes pic.twitter.com/dDGCnj4qNm
— England Cricket (@englandcricket) July 2, 2023