Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమార్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొనింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
Read Also: NBK 109 : డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. తమన్ తాండవం
అయితే, 2019 అక్టోబర్ 29 నుంచి 2022 మార్చి 31వ తేదీ మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్‌టీ బకాయిలు రూ.401.70 కోట్లుగా పేర్కొనింది. ఇది, మహారాష్ట్రలోని ఠాణె జీఎస్‌టీ ఆఫీస్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీనికి వడ్డీ, పెనాల్టీ కింద మరో రూ.401.70కోట్లు చెల్లించాలని ఆదేశించినట్లు జొమాటో వెల్లడించింది. కాగా, దీనిపై తాము సంబంధిత అధికారుల ముందుకు అప్పీల్ చేయబోతున్నాం.. న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నామని కంపెనీ తెలిపింది. అయితే, జొమాటోకు గతంలోనూ ఇలాగే, జీఎస్‌టీ బకాయిల నోటీసులు వచ్చాయి.
Read Also: IndiGo Passengers: ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన 400 ప్రయాణికులు..
కాగా, జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలను రూపొందించారు. ఒకటి ఆహార పదార్థాల ధర, మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జ్.. ఇందులో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మినహాయింపు ఇస్తారు. మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్ ఫీజుపై 5 శాతం ట్యాక్స్.. ఈ పన్నును జీఎస్‌టీ మండలి 2022 జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చింది.