NTV Telugu Site icon

Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!

Zomato 1

Zomato 1

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో దేశంలో నెంబర్‌ వన్‌గా దూసుకెళ్తోంది. కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్న ఈ యాప్ అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్ స్టార్టప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ జొమాటో ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఓ స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు తెలిసే ఇదంతా జరుగుతుండటం చూసి కస్టమర్లు నివ్వెరపోతున్నారు. అదేంటంటే.. మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టే ఉంటారు. మరి ఆర్డర్‌ చేసిన ఫుడ్‌కు ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేస్తున్నారా? లేదంటే క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటున్నారా?. ఎక్కువ ఆన్‌లైన్ పేమెంట్ చేసుంటారు కదా. ఇకపై మాత్రం ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలోనే డబ్బులు చెల్లించండి. ఫుడ్‌ డెలివరీ సంస్థల్ని మోసం చేసి వందల రూపాయిల్ని మీరు కూడా ఆదా చేసుకోండి. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి. పూర్తిగా చదవండి మీకే అర్థం అవుతుంది.

Apple Company: iPhone లేటెస్ట్‌ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా

ఉత్తరాఖండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్‌ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్‌ ఆర్డర్‌ పెట్టారు. ఆర్డర్‌ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్‌ తెచ్చిన ఆ డెలివరీ బాయ్‌.. వినయ్‌తో.. “సార్‌ నెక్ట్స్‌ టైం నుంచి మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయకండి. క్యాష్‌ ఆన్‌ డెలివరీ చేయండి. మీరు 700-800 రూపాయిలు విలువ చేసే ఫుడ్ ఆర్డర్ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. కానీ మీరు నాకు 200 రూ. మాత్రమే చెల్లించండి. మీరు ఆర్డర్‌ను తీసుకోలేదని నేను జొమాటో వాళ్లతో చెబుతా. కానీ మీరు మీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. 200-300రూ. కట్టి 1000రూ. ఫుడ్ తినండి..” అంటూ చెప్పాడు. అది విని ఖంగుతున్న వినయ్.. ఈ ఉదంతాన్ని లింక్‌డిన్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో…జొమాటోలోని డెలివరీ బాయ్స్‌ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్‌బంప్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఇక, జొమాటో డెలివరీ బాయ్‌ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్‌ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్గతం చేయాలా? అని ప్రశ్నించారు.నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకున్నానని.. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్‌పై జొమాటో సీఈవో గోయల్‌ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. అంటే ఇదంతా సీఈఓ లాంటి పై అధికారులకు తెలిసే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.