NTV Telugu Site icon

Zomato: సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా రాజీనామా.. కారణమిదే..!

Akritichopra

Akritichopra

జొమాటోతో ఉన్న 13 సంవత్సరాల అనుబంధాన్ని అక్రితి చోప్రా తెగతెంపులు చేసుకున్నారు. అక్రితి చోప్రా జొమాటో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఆమె జొమాటో సహ వ్యవస్థాపకురాలుగా కూడా ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత జొమాటోకు గుడ్‌‌బై చెప్పారు. సెప్టెంబర్ 27, 2024 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందని అక్రితి పేర్కొన్నారు. సీఈవో దీపిందర్ గోయల్‌కి కృతజ్ఞతలు తెలుపారు. ఈ మేరకు జొమాటో సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ఆమె సంస్థను వీడారని, తక్షణమే ఆమె రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. దాదాపు 13 ఏళ్ల ప్రయాణం తర్వాత ఆమె జొమాటోను వీడారు.

ఇది కూడా చదవండి: Bihar: ప్రభుత్వ పాఠశాలలో అశ్లీల డ్యాన్స్‌లు.. మండిపడుతున్న ప్రజలు

ఆకృతి చోప్రా 2011 నుంచి జొమాటోలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌లో సీనియర్‌ మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, ఆ తర్వాత చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జొమాటోకు చెందిన గ్రాసరీ డెలివరీ విభాగమైన బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సాను వివాహం ఆడారు. మరోవైపు గతంలో వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో జొమాటో సహ వ్యవస్థాపకులు గుంజన్‌ పటీదార్‌, పంకజ్‌ చద్దా, మోహిత్‌ గుప్తా, గౌరవ్‌ గుప్తా జొమాటోను వీడారు. ఆకృతి ఐదో సహ వ్యవస్థాపకులు కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Tirumala Laddu Issue: రేపు సిట్ బృందం తిరుపతికి రాక