YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube vs Instagram: ఒకప్పుడు సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపానికి, వినోదానికి మాత్రమే పరిమితం. కానీ, ఈ రోజు అలా కాదు. మొబైల్లో కేవలం కొన్ని నిమిషాల వీడియోలు అప్లోడ్ చేస్తూ.. లక్షలాది మంది క్రియేటర్లు సినిమా స్టార్స్, బడా బిజినెస్మెన్ల రేంజ్లో సంపాదిస్తున్నారు. అయితే, క్రియేటర్ల పాలిట అసలైన ‘కామధేనువు’ ఏది? ఇన్స్టాగ్రామా లేక యూట్యూబా? రీల్స్ ద్వారా ఎక్కువ మనీ వస్తుందా.. లేక లాంగ్ వీడియోస్ ద్వారా వస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ క్రియేటర్ల అసలు సంపాదన లెక్కలేంటి? ఈ స్పెషల్ స్టోరీలో ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో ‘కంటెంట్ క్రియేటర్ ఎకానమీ’ ఊహించని స్థాయిలో పుంజుకుంది. ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ (Forbes) నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 50 క్రియేటర్లు కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు 853 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7,000 కోట్లు) సంపాదించారు. వీరి మొత్తం ఫాలోవర్ల సంఖ్య 337 కోట్లకు పైమాటే. ఈ లెక్కలను బట్టి చూస్తే సోషల్ మీడియా అనేది ఇప్పుడు కేవలం ఒక పాపులారిటీ వేదిక కాదు.. కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగే ఒక పెద్ద బిజినెస్ ఇండస్ట్రీగా మారిపోయిందని అర్థం అవుతుంది.
Also Read
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
యూట్యూబ్ Vs ఇన్స్టాగ్రామ్: ఎవరి ప్లస్ పాయింట్స్ వారివే!
యూట్యూబ్ (YouTube) టాప్ ఫీచర్స్:
వీడియోలపై వచ్చే యాడ్స్ ద్వారా నేరుగా క్రియేటర్ల అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి.
పాత వీడియోలకు కూడా వ్యూస్ వస్తూ ఉంటే.. లైఫ్ లాంగ్ సంపాదన అందుకోవచ్చు.
ఛానల్ మెంబర్షిప్స్, సూపర్ చాట్స్, సూపర్ థాంక్స్, ప్రీమియం రెవెన్యూ లాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి.
లోతైన, లాంగ్ కంటెంట్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫార్మ్.
క్రియేటర్లకు స్థిరమైన, శాశ్వతమైన ఆదాయ వనరుగా నిలుస్తుంది.
ఇన్స్టాగ్రామ్ (Instagram) టాప్ ఫీచర్స్:
బ్రాండ్ కొల్లాబరేషన్స్, స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా భారీగా సంపాదించవచ్చు.
తక్కువ నిడివి గల రీల్స్ కంటెంట్‌తో రాత్రికి రాత్రే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకోవచ్చు.
ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ క్రియేటర్లకు ఇది ఒక మైనింగ్ లాంటిది.
ఫాలోవర్లతో డైరెక్ట్ ఎంగేజ్మెంట్, కమ్యూనికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పర్సనల్ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి, కార్పొరేట్ కంపెనీలను ఆకర్షించడానికి అద్భుతమైన వేదిక.
డబ్బుల విషయంలో ‘యూట్యూబే’ కింగ్..
నేరుగా వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే.. నేటికీ క్రియేటర్ల ఫస్ట్ ఛాయిస్ యూట్యూబే. ఎందుకంటే యూట్యూబ్ తన ‘పార్ట్నర్ ప్రోగ్రామ్’ ద్వారా యాడ్స్ రెవెన్యూలో పెద్ద మొత్తాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుంది. అంటే వ్యూస్ పెరిగే కొద్దీ ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. గ్లోబల్ స్టార్ మిస్టర్ బీస్ట్ ఫోర్బ్స్ లిస్ట్‌లో వరుసగా నంబర్ 1 స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. ఆయన ఏడాది సంపాదన అక్షరాలా 85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.700 కోట్లు). అలాగే ధార్ మన్ (56 మిలియన్ డాలర్లు), మార్క్ రోబర్ లాంటి ఎందరో క్రియేటర్లకు యూట్యూబే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.
ఇన్స్టాగ్రామ్ స్ట్రాటజీ వేరు..
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లేదా పోస్టుల ద్వారా నేరుగా వచ్చే ఆదాయం తక్కువే అయినప్పటికీ.. ‘బ్రాండ్ వాల్యూ’ పరంగా దీని రేంజ్ వేరు. ఇన్‌స్టాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, మంచి ఎంగేజ్మెంట్ ఉన్న క్రియేటర్లు ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్‌కు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. ముఖ్యంగా లైఫ్‌స్టైల్, బ్యూటీ బ్రాండ్స్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్లపై కోట్లు కుమ్మరిస్తున్నాయి.
భారత్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..
మనదేశంలో కూడా క్రియేటర్లు ఇవే ఫార్ములాలను వాడుతున్నారు. ఇండియన్ యూట్యూబర్లు యాడ్స్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదిస్తుంటే.. ఇన్‌స్టా సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా గల్లా పెంచుకుంటున్నారు. అందుకే స్మార్ట్ క్రియేటర్లు ఎవరూ ఒకే ప్లాట్ఫార్మ్పై ఆధారపడటం లేదు. యూట్యూబ్ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని, ఇన్స్టాగ్రామ్ ద్వారా క్రేజ్, బ్రాండ్ డీల్స్‌ను దక్కించుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ (AI), డిజిటల్ మార్కెటింగ్ విస్తృతితో ఈ క్రియేటర్ ఎకానమీ మరింత దూసుకుపోనుందని చెబుతున్నారు. నెటిజన్లను ఆకట్టుకునే కంటెంట్‌తో పాటు, దానిని బిజినెస్‌గా మార్చగలిగే టాలెంట్ ఉన్నవారే సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!