NTV Telugu Site icon

SBI: అలర్ట్.. మీరు ఈ పని చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్..!

Sbi Copy

Sbi Copy

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాక్‌ ఇస్తుంది.. నో యువర్-కస్టమర్ (KYC) నిబంధనలను పాటించనందున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనేక మంది ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేసింది. ఎస్బీఐ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. బ్యాంక్ కస్టమర్లు దీనికి సంబంధించిన ఫిర్యాదులను ట్వీట్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే.. కేవైసీ నిబంధనల్ని పాటించని కారణంగా ఎస్బీఐ తన ఖాతాదారుల అకౌంట్లను నిలిపివేస్తోంది. జులై 1వ తేదీ నాటికి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయని కారణంగా మన ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్‌ చేస్తోంది స్టేట్‌ బ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. దీనిపై సోషల్‌ మీడియా వేదిక కస్టమర్లు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

Read Also:
YSRCP Plenary 2022: నోరూరిస్తున్న వైసీపీ ప్లీనరీ ఫుడ్‌ మెనూ.. 25 రకాల వంటకాలు
అయితే, ఎస్బీఐ ప్రస్తుతం కేవైసీ డ్రైవ్ చేపట్టింది.. అందులో భాగంగా కేవైసీ అప్‌డేట్ లేని ఖాతాలను బ్లాక్‌ చేస్తూ పోతోంది.. దీని కారణంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం అంటూ విదేశాల్లో ఉంటున్న ఎస్బీఐ కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. అయితే, మీ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు చేయలేకపోతున్నారంటే.. మీ అకౌంట్ కేవైసీ వివరాలు అప్‌డేట్ కానట్టే అంటున్నాయి ఎస్బీఐ వర్గాలు. వెంటనే సంబంధిత బ్రాంచ్‌ను సందర్శించి, మీ అకౌంట్ సజావుగా పనిచేసేందుకు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా చెబుతున్నారు.. కానీ, దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన ఖాతాలను నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు.. కేవైసీ వివరాలు లేవని అకౌంట్ నిలిపివేశారని, కేవైసీ అప్‌డేట్ చేయాలని తనను ఎవరూ కోరలేదంటున్నారు.. మొత్తంగా కేవైసీ అప్‌డేట్‌ లేని కారణంగా అకౌంట్లు బ్లాక్ అవుతుండటంతో ఎస్బీఐ ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది.. లేనిచో సంబంధిత బ్రాంచ్‌ని సంప్రదించడమే బెటర్‌.