NTV Telugu Site icon

LIC Scheme: స్కీమ్ అంటే ఇది కదా.. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతి నెల రూ. 12 వేలు పొందండి

LIC Saral Pension scheme

కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. నేడు మీరు చేసే పొదుపు రేపటి మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి కాపాడుతుంది. అత్యవసర సమయాల్లో పొదుపు చేసిన సొమ్ము ఉపయోగపడుతుంది. అందుకే నేటి రోజుల్లో అందరు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. డబ్బు సంపాదించడమే కాదు.. ఆ డబ్బుతోనే డబ్బును ఎలా సంపాదించాలో ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం రకరకాల మార్గాలున్నాయి. కానీ భద్రతతో కూడిన పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి.

మరి మీరు కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే ఎల్ ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్. ఈ పథకంలో సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ తో ప్రతి నెల రూ. 12 వేలు పొందొచ్చు. ప్రతి నెల ఆదాయం కోరుకునే వారికి బెస్ట్ ప్లాన్ గా చెప్తున్నారు నిపుణులు. ఎల్ ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ లో చేరడానికి అర్హులు ఎవరు? ఎంత కట్టాలి? ఆ వివరాలు మీకోసం.. ఎల్ ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ లో 40-80 సంవత్సరాల వయసున్న వారు చేరొచ్చు. ఈ పాలసీలో యాన్యూటీని కొనుగోలు చేయాలి. నెలవారీ పెన్షన్ కావాలనుకుంటే రూ. 1000 వార్షికాన్ని కొనుగోలు చేయాలి. మీకు వార్షిక పెన్షన్ కావాలనుకుంటే రూ. 12 వేల యాన్యుటీని కొనుగోలు చేయాలి.

కాగా ఈ పాలసీలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు. గరిష్టంగా పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్ మెంట్ పై ఆధారపడి పెన్షన్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఇక ఈ పథకంలో 42 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ. 30 లక్షల యాన్యుటీ కొనుగోలు చేస్తే ప్రతి నెల రూ. 12,388 పెన్షన్ ను అందుకోవచ్చు. ఎల్ ఐసీ సరళ్ పెన్షన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. మరి ప్రతి నెల ఆదాయం కోరుకునే వారు.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మేలు అని అంటున్నారు నిపుణులు.

Show comments