టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం) పెరుగుతూ పోతోంది.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 15.08 శాతంగా నమోదు కాగా.. ఇక, మే నెలలో 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని 15.88 శాతంగా నమోదైంది.. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.. కాగా, ఏప్రిల్‌లోనే 30 ఏళ్ల గరిష్టాన్ని తాకింది టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. ఇప్పుడు అది కొనసాగిస్తూ.. మరింత పైకి కదలడం ఆందోళన కలిగించే విషయం.. మేలో, భారతదేశంలో పట్టణ ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉండగా.. గ్రామీణ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది.. ఇది కేరళలో అత్యల్పంగా 4.8 శాతంగా ఉంటే.. తెలంగాణలో అత్యధికంగా 9.5 శాతానికి చేరింది.. ఇక, రూపాయితో డాలర్ మారకం విలువ బలపడే విధంగా ఆర్బీఐ ప్రయత్నాలు చేయకపోవడం కారణంగా రూపాయి విలువ 82కి పడిపోవచ్చుననే అంచనాలు నెలకొన్నాయి.. ఈ ఏడాది జనవరి 1న డాలర్‌తో 74.51గా ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది 5.9 శాతం క్షీణించి 78.95కి చేరుకుంది. పెరుగుతున్న డాలర్ ఇండెక్స్, వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం రూపాయి క్షీణతకు ప్రధాన కారణం అనే ఆందోళనలు నెలకొన్నాయి.. ఇది ఇలాగే కొనసాగితే రూపాయి విలువ 82కు చేరుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
Read Also: Pawan Kalyan: తాడిమర్రి ఘటనపై పవన్ కల్యాణ్ ఆవేదన.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే..!
మరోవైపు, భారతీయ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డ్ వినియోగదారుల కంటే 40 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తాజా అధ్యయనం తేల్చింది.. క్రెడిట్ కార్డ్‌ల కారణంగా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి సులువు కావడంతో క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతోంది.. క్రెడిట్ కార్డ్‌లు, మొత్తం డెబిట్ కార్డ్‌లలో 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ ఖర్చులకు సంబంధించినంత వరకు క్రెడిట్ కార్డులపై 3 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.. అయితే, వారు ఇంటర్నెట్‌పై మరింత అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..