Site icon NTV Telugu

Digital Silver: డిజిటల్ వెండి అంటే ఏంటో తెలుసా? పెట్టుబడి పెట్టే మార్గాలు ఇవే!

Digital Silver

Digital Silver

Digital Silver: పసిడితో సమానంగా పరుగులు పెడుతుంది వెండి.. ఈ రోజుల్లో చాలా మంది వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా, బలమైన పెట్టుబడి ఎంపికగా కూడా చూస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితి, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న డిమాండ్ పెట్టుబడిదారులలో వెండిపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా నేడు వెండిలో పెట్టుబడి పెట్టడానికి అనేక సులభమైన, ఆధునిక మార్గాలు ఉన్నాయి. ఇంతకీ ఆ మార్గాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Shivaji: బాగా కావాల్సిన వారే నాపై కుట్ర చేశారు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు

నిజానికి భౌతిక వెండి అత్యంత సాంప్రదాయ పెట్టుబడి రూపం. చాలా మంది వెండిని నాణేలు, కడ్డీలు లేదా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటి ద్వారా కొనుగోలుదారులకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే వారు ఖర్చు చేసిన డబ్బుకు, ప్రత్యక్షంగా కనిపించే ఆస్తిని కలిగి ఉంటారు. అయితే కొనుగోలు చేసిన వెండి నిల్వ, భద్రత, తయారీ ఛార్జీలు వంటి ఖర్చులను కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దాని స్వచ్ఛత పరీక్ష కూడా ఒక ముఖ్యమైన అంశం, కాబట్టి పేరున్న విక్రేత నుంచి మాత్రమే వెండిని కొనుగోలు చేయడం ఉత్తమంగా పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

సిల్వర్ ETFలు
భౌతిక వెండిని కలిగి ఉండటంలో ఇబ్బంది పడకుండా ఉండాలనుకునే పెట్టుబడిదారులకు, వెండి ETFలు ఒక మంచి ఎంపికని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో వెండి ధరలను ట్రాక్ చేసే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో స్టాక్‌ల వలె ఎప్పుడు అంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చు, అలాగే అమ్మకం కూడా చేయవచ్చు. వాస్తవానికి ఇవి తక్కువ నిల్వ, ఎక్కువ పారదర్శకతను అందిస్తాయని చెబుతున్నారు.

డిజిటల్ సిల్వర్
ఈ రోజుల్లో డిజిటల్ వెండి బాగా ప్రాచుర్యం పొందుతోంది. మొబైల్ యాప్‌లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తక్కువ మొత్తంలో వెండిలో పెట్టుబడి పెట్టడం సాధ్యమవుతుంది. ఇందులో కొనుగోలు చేసిన వెండిని సురక్షితమైన ఖజానాలో నిల్వ చేస్తారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మీకు అవసరమైనప్పుడు భౌతికంగా కూడా మీ వెండిని మీకు డెలివరీ కూడా చేస్తారు.

సిల్వర్ బాండ్లు & ఇతర ఎంపికలు
కొన్ని సంస్థలు వెండి ధరలతో ముడిపడి ఉన్న వెండి బాండ్ల వంటివి పెట్టుబడిదారులకు అందిస్తున్నాయి. వీటికి అదనంగా కమోడిటీ మార్కెట్లలో ఫ్యూచర్స్, ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కొంచెం ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. మొత్తం మీద ఈ రోజుల్లో వెండిలో పెట్టుబడి పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు వారి రిస్క్ అప్పెటిట్, పెట్టుబడి హోరిజోన్, వారి సౌలభ్యం ఆధారంగా భౌతిక వెండి, లేదంటే ETFలు, డిజిటల్ వెండి లేదా ఇతర మార్గాలను ఎంచుకోవచ్చు. తెలివిగా పెట్టుబడులు పెడితే, మంచి పోర్ట్‌ఫోలియోలను సొంతం చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Health Tips: పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని ఈ టిప్స్‌తో దూరం చేయవచ్చు..!

Exit mobile version