ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. భార్యతో కలిసి జొమాటో డ్రస్‌లో ఇద్దరూ ఫుడ్ డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఇదే మాదిరిగా చేసిన గోయల్.. ఈసారి భాగస్వామిని వెంటవేసుకుని ఫుడ్ డెలివరీ చేసి ఆశ్చర్యపరిచారు.
ఇది కూడా చదవండి: ఒక్క ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోని క్రికెటర్లు వీళ్లే..
దీపిందర్ గోయల్, భార్య గ్రేసియా మునోజ్ అలియాస్ గియా గోయల్‌తో కలిసి గురుగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ చేశారు. జొమాటో విధానాన్ని స్వయంగా పరిశీలించేందుకు.. కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకునేందు ఈ విధంగా చేసినట్లు సోషల్ మీడియాలో తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. ఆఫీస్‌లో కూర్చీ విడిచిపెట్టి.. బైక్‌పై భార్యాభర్తలిద్దరూ డెలివరీ చేసే పాత్రను ఎంచుకున్నారు. కేవలం జొమాటో ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ పాత్రను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్‌లో మ్యాజిక్ ఫిగర్‌కి దూరంగా కాంగ్రెస్, బీజేపీ..
ఇన్‌స్టాగ్రామ్‌లో డెలివరీ బాయ్ అనుభవాన్ని పంచుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్డర్‌లను డెలివరీ చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. భార్య గ్రేసియా మునోజ్‌తో ఈ పని చేసినట్లు రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. కస్టమర్ల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కస్టమర్లకు డెలివరీ చేయడాన్ని తాను ఇష్టపడతానని తెలిపారు. అంతేకాకుండా భార్యతో రైడ్ ఆస్వాదించినట్లు క్యాప్షన్ పెట్టారు. ఫొటోలతో కూడిన పోస్ట్‌కి 28,000 లైక్‌లు వచ్చాయి, రీల్‌కు దాదాపు 12,000 లైక్‌లు వచ్చాయి. గోయల్, భార్య గ్రేసియా విధానంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేయగా.. మరికొందరు విమర్శలు చేశారు. గురుగ్రామ్‌లో కాదు.. సిటీ వెలుపల కూడా ఇలా చేయాలని పలువురు ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: అత్యధికంగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన మహిళ ఆటగాళ్లు వీళ్లే