NTV Telugu Site icon

Vodafone-Idea: చౌక ధరలో న్యూ రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్!

Vodafone Idea

Vodafone Idea

టెలికాం కంపెనీలు యూజర్లను ఆకర్షించడానికి సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్లను కాపాడుకునేందుకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీలు యూజర్లను ఆకర్షించే పనిల పడ్డాయి. ఇప్పుడు మొబైల్ యూజర్స్ కోసం మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం న్యూ ప్రిపేయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ చౌక ధరలోనే ఉండనున్నది. కేవలం రూ. 209తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ తో డైలీ 2GB డేటాను అందుకోవచ్చు. మీరు ప్లాన్‌లో 300 ఉచిత SMSలను కూడా పొందుతారు. అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే అపరిమిత కాలర్ ట్యూన్ లను పొందొచ్చు. యూజర్ల కోసం మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

అదే రూ. 218 ప్లాన్. దీనితో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఈ ప్లాన్ లో 3GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఉచిత SMSలను అందిస్తోంది. పరిమితి ముగిసిన తర్వాత ప్రతి SMSకి రూ. 1, STD SMS కోసం రూ. 1.5 వసూలు చేస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఈ రీఛార్జ్ లపై ఓ లుక్కేయండి.

Show comments