NTV Telugu Site icon

Nirmala Sitharaman: సెబీపై వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయండి

Nirmalasitharaman

Nirmalasitharaman

సెబీ చీఫ్ మాధబిపై అమెరికా సంస్థ హిండెన్‌బర్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అనంతరం విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున సెబీపై విమర్శలు చేశారు. తాజాగా ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సెబీపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు ఆర్థిక మంత్రి సూచించారు. నియంత్రణ సంస్థలను ప్రశ్నించే అంశానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. కానీ సంబంధిత సంస్థల సేవలను గుర్తు ఎరిగి ఉండాలని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

ఇటీవల సెబీ చీఫ్‌ మాధబిపై ‘హిండెన్‌బర్గ్‌’ ఆరోపణలు, సెబీలో పనితీరుపై అక్కడి ఉద్యోగులు రాసిన లేఖ బయటకురావడం వంటి వ్యవహారాల వేళ నిర్మలమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే సెబీ చీఫ్ మాధబికి ఇటీవల పార్లమెంట్ కమిటీ కూడా సమన్లు జారీ చేసింది. సెబీ చీఫ్‌తో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ అనిల్‌కుమార్‌ లాహోటీలను ఈ నెల 24 విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంట్‌లోని పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ (పీఎసీ) నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగం), రెవెన్యూశాఖలోని ఉన్నతాధికారులను కూడా కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: మద్యం దుకాణాలకు భారీగా అప్లికేషన్లు

అదానీ విదేశీ సంస్థలతో మాధబికి మంచి సంబంధాలు ఉన్నాయని.. అక్కడ నుంచి ఆమె ఆదాయాలు కూడా పొందుతున్నట్లు అమెరికన్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసింది. ఈ నివేదికపై ప్రతిపక్షాలు ఆగస్టు నుంచి నిరసనలు చేపట్టాయి. మాధబి బుచ్‌ రాజీనామా చేయాలని, నివేదికపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఆమెకు పార్లమెంట్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈనెల 24న కాంగ్రెస్, హిండెన్‌బర్గ్‌పై చేసిన ఆరోపణలపై ప్రశ్నించనున్నారు. అలాగే అదానీ సంస్థతో ఉన్న సంబంధాలపై కూడా విచారించనున్నారు.

ఇది కూడా చదవండి: Sri Lanka: అదానీ సంస్థకు షాక్.. విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న కొత్త ప్రభుత్వం

Show comments