Site icon NTV Telugu

Liquor Prices: యూకే-ఇండియా డీల్.. భారీగా మద్యం స్టాక్స్ పతనం..!

Liquor Prices

Liquor Prices

Liquor Prices: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) లిక్కర్ రంగంలోని స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ప్రముఖ మద్యం కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈ ఒప్పందంలో స్కాచ్, విస్కీ, జిన్‌పై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించడం వల్ల మార్కెట్‌లో ధరల పోటీ పెరిగే అవకాశంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి

ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం 150% దిగుమతి సుంకం ఉన్న స్కాచ్, జిన్‌పై మొదటగా 75%కు తగ్గింపు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా 10 సంవత్సరాల్లో 40%కి తగ్గింపు చేయనున్నారు. దీనితో భారీగా దిగుమతి మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇలా సుంకాలు తగ్గించడంతో అంతర్జాతీయ బ్రాండ్లు జానీ వాకైర్, చివాస్ రీగల్, బాలంటైన్ లాంటి వాటికి లాభదాయకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో బాటిల్ కు 100 నుంచి 300 రూపాయలు వరకూ తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏమిటంటే.. మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీలు, ఎక్స్-డిస్టిలరీ ప్రైసింగ్ లాంటి అంశాలు రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరులు కావడంతో ఈ ఒప్పంద ప్రభావం వినియోగదారులకు పూర్తిగా చేరకపోవచ్చు.

GST Fraud: రెస్టారెంట్‌ ఉద్యోగికి రూ.4.60 కోట్ల జీఎస్టీ.. ఫిర్యాదు తీసుకోని హైదరాబాద్ పోలీసులు! చివరకు

భారతదేశం గత దశాబ్దంలో జరిగిన తొలి అతిపెద్ద FTA అయినప్పటికీ, మద్యం రంగంపై దీని తక్షణ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఇది ఒకదానిపై మౌలిక ప్రభావం చూపకపోవచ్చు కానీ.. ప్రీమియం బ్రాండ్ల పోటీ దేశీయ కంపెనీలకు మానిటరీ, మార్కెట్ భాగస్వామ్యంలో సమస్యలు తలెత్తించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ తాజా ఒప్పంద వల్ల Radico Khaitan షేరు ధర 1.69% మేర పడిపోయింది. అదే విధంగా, Tilaknagar Industries షేర్లు 2.09% నష్టపోయాయి. ప్రముఖ బ్రాండ్ అయిన United Spirits షేరు ధర కూడా 0.69% మేర తగ్గింది. ఈ పతనాలు భారత్-యూకే మధ్య కుదిరిన FTA ఒప్పంద ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే భారత బ్రేవెర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి మాట్లాడుతూ.. ప్రస్తుత ధర తగ్గింపులు తాత్కాలికంగానో, పరిమితంగానో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Exit mobile version