సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ట్విట్టర్‌లో ట్వీట్లు చేయడానికి యూజర్లు నానా అవస్థలు పడ్డారు. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే లాగౌట్ అయిందని పలువురు వాపోయారు.
ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంపై డౌన్‌డిటెక్టర్ అనే ట్రాక్ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి. అయితే ఈ అంతరాయంపై ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. సాంకేతిక సమస్యల(టెక్నికల్బగ్) కారణంగానే తమ సేవలకు అంతరాయం కలిగినట్లు ట్విట్టర్ తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్‌నే ట్రోల్చేస్తూ పలువురు ట్వీట్లు చేశారు.