ట్విటర్ సీఈవో పదవికి జాక్ డోర్సే రాజీనామా తర్వాత ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. అయితే ఆయన వార్షిక వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఏడాదికి 1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్లకు పైగా) జీతం పొందుతారని కంపెనీ US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు తెలిపింది. అంతేకాకుండా అగర్వాల్ 1.25 మిలియన్ డాలర్ల (రూ.94 కోట్లు) విలువైన షేర్లను పొందుతారని కూడా వెల్లడించింది. వీటిని మూడు నెలల గ్యాప్‌లో 16 క్వార్టర్స్‌లో అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పరాగ్ అగర్వాల్‌కు షేర్లు అందనున్నాయి.
Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అయితే పరాగ్ అగర్వాల్ ముందు ట్విటర్ సీఈవోగా పనిచేసిన జాక్ డోర్సే ఏడాదికి 1.40 మిలియన్ డాలర్ల జీతాన్ని పొందారు. కాగా పరాగ్ అగర్వాల్ ముంబై ఐఐటీలో విద్యను అభ్యసించారు. అనంతరం యాహూ, మైక్రోసాఫ్ట్, L&T ల్యాబ్స్‌లో పనిచేసిన పరాగ్.. 2011లో ట్విటర్ సంస్థలో చేరారు. 2017లో ఆ సంస్థ సీటీవోగా బాధ్యతలు చేపట్టారు. కేవలం పదేళ్ల అనుభవంతో ట్విట్టర్ లాంటి సంస్థకు సీఈఓ అవ్వడం అంటే మాటలు కాదని చాలామంది తనను ప్రశంసిస్తున్నారు.
