RBI Governor: భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాల ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం సూచించారు.
READ MORE: Mohammad Kaif: గంభీర్ కోచింగ్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ రివ్యూ..!
తాజా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మల్హోత్రా మాట్లాడారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చన్నారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది.” అని సంజయ్ ప్రకటించారు.
READ MORE: Mosquito zapper: 1 సెకనులో 30 దోమలు మటాష్..ఇది ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు
