Stock Market: దేశీయ మార్కెట్లు ఈరోజు (జూలై 31న) భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో భారత సూచీలు నష్టాల బాట పట్టాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌కు రెండు రోజుల లాభాలు ఒక్కసారిగా ఆవిరవుతున్నాయి. నేటి ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 80,946 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 157 పాయింట్లు క్షీణించి 24,696 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.66 దగ్గర కొనసాగుతుంది.
Read Also: Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
అయితే, నిఫ్టీ సూచీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, హెచ్‌యూఎల్ షేర్లు రాణిస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న (జూలై 30న) అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్‌ను ముగించగా.. నేడు ఆసియా మార్కెట్లు అదే బాటలో నడుస్తున్నాయి. దీంతో కేవలం 10 నిమిషాల్లోనే సుమారు 3 లక్షల కోట్లు అవిరి అయ్యాయి. ఇక, మార్కెట్ అస్థిరతను కొలిచే విక్స్ సూచిక 3.13 శాతం నష్టాల్లో కొనసాగుతుంది. యూఎస్ సుంకాల ప్రకటన, ఆంక్షలు దీనిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
Read Also: Gold Rates: యాహూ.. కనకం కమింగ్ డౌన్.. వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇక, భారత్ నుంచి తమ దేశంలోకి వచ్చే ఉత్పత్తులపై ఆగస్టు 1వ తేదీ నుంచి 25 శాతం మేర టారిఫ్‌తో పాటు అదనపు పెనాల్టీ విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. భారత్ కు చెందిన 6 చమురు కంపెనీలపై తాజాగా, యూఎస్ ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా 20 సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలు సైతం ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
