Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్‌గా మొబైల్‌లో తెలుసుకోండిలా..

Gas Cylinder

Gas Cylinder

సాధారణంగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత, అది ఎప్పుడు ఇంటికి చేరుతుందోననే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల సరఫరాలో జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. అయితే, ఇప్పుడు వినియోగదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ ఫోన్ ద్వారానే సిలిండర్ లైవ్ లొకేషన్, డెలివరీ స్టేటస్ మరియు అది ఇంటికి వచ్చే సమయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

మొబైల్ యాప్ ద్వారా ట్రాకింగ్ విధానం.. 
ఇండేన్ (Indane), హెచ్‌పీ గ్యాస్ (HP Gas), భారత్ గ్యాస్ (Bharat Gas) వంటి ప్రముఖ గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల కోసం అధికారిక మొబైల్ యాప్‌లను అందిస్తున్నాయి.

×
×
Ad

స్టెప్ 1: ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: లాగిన్ అయిన తర్వాత యాప్‌లో కనిపించే “మై బుకింగ్” లేదా “ట్రాక్ సిలిండర్” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ సిలిండర్ బుకింగ్ తేదీ, డిస్పాచ్ అప్‌డేట్ మరియు డెలివరీ స్థితి స్పష్టంగా కనిపిస్తాయి.

వెబ్‌సైట్ మరియు ఎస్ఎమ్ఎస్ ద్వారా..
ఒకవేళ మొబైల్ యాప్ ఉపయోగించడం ఇష్టం లేని వారు, సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ ఎల్‌పీజీ ఐడీ (LPG ID) లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి స్టేటస్ తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేని సాధారణ ఫోన్ వినియోగదారులు ఎస్ఎమ్ఎస్ (SMS) లేదా ఐవీఆర్ఎస్ (IVRS) కాల్ సర్వీస్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లు..
వినియోగదారులు ఈ నంబర్లకు కాల్ చేసి కూడా తమ సిలిండర్ డెలివరీ వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. ఇండేన్ గ్యాస్ 7718955555, హెచ్‌పీ గ్యాస్ 7903105555, భారత్ గ్యాస్ 7715012345. ఈ డిజిటల్ సేవల వల్ల గ్యాస్ డెలివరీకి సంబంధించి ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వినియోగదారుల సమయం ఎంతో ఆదా అవుతుంది.