Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్‌గా మొబైల్లో తెలుసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత, అది ఎప్పుడు ఇంటికి చేరుతుందోననే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల సరఫరాలో జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. అయితే, ఇప్పుడు వినియోగదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ ఫోన్ ద్వారానే సిలిండర్ లైవ్ లొకేషన్, డెలివరీ స్టేటస్ మరియు అది ఇంటికి వచ్చే సమయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా ట్రాకింగ్ విధానం..
ఇండేన్ (Indane), హెచ్‌పీ గ్యాస్ (HP Gas), భారత్ గ్యాస్ (Bharat Gas) వంటి ప్రముఖ గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల కోసం అధికారిక మొబైల్ యాప్‌లను అందిస్తున్నాయి.
Also Read
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
స్టెప్ 1: ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2: లాగిన్ అయిన తర్వాత యాప్‌లో కనిపించే “మై బుకింగ్” లేదా “ట్రాక్ సిలిండర్” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ సిలిండర్ బుకింగ్ తేదీ, డిస్పాచ్ అప్డేట్ మరియు డెలివరీ స్థితి స్పష్టంగా కనిపిస్తాయి.
వెబ్సైట్ మరియు ఎస్ఎమ్ఎస్ ద్వారా..
ఒకవేళ మొబైల్ యాప్ ఉపయోగించడం ఇష్టం లేని వారు, సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ ఎల్పీజీ ఐడీ (LPG ID) లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి స్టేటస్ తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేని సాధారణ ఫోన్ వినియోగదారులు ఎస్ఎమ్ఎస్ (SMS) లేదా ఐవీఆర్ఎస్ (IVRS) కాల్ సర్వీస్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.
ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లు..
వినియోగదారులు ఈ నంబర్లకు కాల్ చేసి కూడా తమ సిలిండర్ డెలివరీ వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. ఇండేన్ గ్యాస్ 7718955555, హెచ్‌పీ గ్యాస్ 7903105555, భారత్ గ్యాస్ 7715012345. ఈ డిజిటల్ సేవల వల్ల గ్యాస్ డెలివరీకి సంబంధించి ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వినియోగదారుల సమయం ఎంతో ఆదా అవుతుంది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!