భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇన్వెస్టర్లకు రుచించలేదు. డీల్ తర్వాత సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తాయని ఆర్థిక నిపుణులు భావించారు. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ తిరోగమనం వెళ్తోంది. డీల్‌పై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడం కారణమో.. లేదంటే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తలు కారణమో తెలియదు గానీ.. మంగళవారం మార్కె్ట్ నష్టాల్లో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రొటోకాల్‌పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ.. ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్‌గాంధీ, ఖర్గే
ప్రస్తుతం సెన్సె్క్స్ 423 పాయింట్లు నష్టపోయి 81,114 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 24, 943 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, JSW స్టీల్ లాభాలను ఆర్జించగా.. M&M, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఎటర్నల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నష్టపోయాయి. మెటల్ మినహా అన్ని ఇతర రంగాల సూచీలు ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ 1 శాతం క్షీణించి నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Road Accident: క్రూజర్, కంటైనర్ ఢీ.. నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
