NTV Telugu Site icon

Today (09-02-23) Business Headlines: ఇన్సూరెన్స్ కంపెనీలూ.. ఇది కరెక్ట్ కాదు. మరిన్ని వార్తలు

Today (09 02 23) Business Headlines

Today (09 02 23) Business Headlines

Today (09-02-23) Business Headlines:

రెండేళ్లలో 1700 విమానాలకు ఆర్డర్లు

రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరిగే అవకాశం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువని కన్సల్టెన్సీ కంపెనీ.. కాపా.. పేర్కొంది. ఈ డిమాండ్ నేపథ్యంలో భారత విమానయాన రంగ సంస్థలు ఒకటీ రెండేళ్లలో 15 వందల నుంచి 17 వందల వరకు కొత్త విమానాల కోసం ఆర్డర్లు పెడతాయని తెలిపింది. ఎయిరిండియా ఒక్కటే 500 విమానాలు కొనే సూచనలున్నాయని వెల్లడించింది. ఇండిగో కంపెనీ తన విమానాల సంఖ్యను 500 నుంచి 13 వందలకు పెంచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఇండియాలో కమర్షియల్ విమానాల సంఖ్య తక్కువేనని గుర్తు చేసింది.

‘ఎల్ అండ్ టీ’తో రక్షణ శాఖ కాంట్రాక్ట్

వంతెనల తయారీ మరియు సరఫరా కోసం భారత రక్షణ శాఖ.. ఎల్ అండ్ టీ కంపెనీతో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2 వేల 585 కోట్ల రూపాయలు. ఈ బ్రిడ్జ్’లను చిన్న చిన్న భాగాల్లాగా.. అంటే.. మాడ్యూల్స్ మాదిరిగా తయారు చేస్తారు. ఈ మాడ్యూల్స్’ని ఫీల్డ్ లెవల్’లో జాయింట్ చేయటం ద్వారా వంతెనల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయటానికి వీలుపడుతుంది. వీటికి సంబంధించిన డిజైన్’ని DRDO పూర్తిచేసింది. ఒక్కో బ్రిడ్జ్ పొడవు 46 మీటర్ల వరకు ఉంటుంది.

ఇన్సూరెన్స్ కంపెనీలకు కీలక సూచన

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి అందుతున్న ప్రతి ఐదు ఫిర్యాదుల్లో ఒకటి కంటే ఎక్కువగా ఇన్సూరెన్స్ సెక్టార్ నుంచే వస్తున్నాయి. బీమా ఒప్పందాల్లో క్లారిటీ లేకపోవటం మరియు రూల్స్ అండ్ రెగ్యులేషన్సే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలంటూ బీమా సంస్థలకు మరియు బీమా కంపెనీల నియంత్రణ సంస్థ IRDAIని సర్కారు ఆదేశించింది. వినియోగదారుల కోర్టుల్లో ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ల కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

జీ20 దేశాల ప్రయాణికులకు యూపీఐ

జీ20 సభ్య దేశాల నుంచి ఇండియాకి వచ్చే ప్యాసింజర్లకు సెలెక్ట్ చేసిన ఎయిర్ పోర్టుల్లో యూపీఐ పేమెంట్స్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు. ముందు ముందు మరిన్ని దేశాల ప్రయాణికులకు ఈ సేవలను అందించనున్నారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్బీఐ వెల్లడించింది. ఇదిలాఉండగా.. జనవరి నెలలో యూపీఐ పేమెంట్ల విలువ 13 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. నాన్ రెసిడెంట్ ఇండియన్లు తమ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ల నుంచి యూపీఐ పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని గత నెలలో కల్పించిన సంగతి తెలిసిందే.

ఆఫ్రికా, లాటిన్ అమెరికాలపై ఓఎన్జీసీ దృష్టి

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్.. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్.. భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించింది. ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాల్లోని ఆయిల్ అండ్ గ్యాస్ హాట్ స్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజర్షి గుప్తా తెలిపారు. ఘనా మరియు సురినం తదితర ప్రాంతాల్లోని చమురు మరియు వాయు నిక్షేపాల గుర్తింపు, వెలికితీతకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ రెండు ఖండాల్లోని మొజాంబిక్, బ్రెజిల్, వెనెజులా వంటి దేశాల్లో ఇప్పటికే తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

భవిష్యత్తులో మరిన్ని రెపో రేట్ పెంపులు

రెపో రేటును భవిష్యత్తులో మరిన్ని సార్లు పెంచే సూచనలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. వడ్డీ రేటును తాజాగా సున్నా పాయింట్ రెండు ఐదు శాతం పెంచి మొత్తం ఆరున్నర శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లు, ఇంతకుముందే కొనుగోలు చేసినవాళ్లు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు భారంగా మారనున్నాయి. వచ్చే ఏడాది జీడీపీ ఆరు పాయింట్ 4 శాతంగా నమోదు కానుందని కేంద్ర బ్యాంకు అంచనా వేసింది.

Show comments