NTV Telugu Site icon

Four months time: నాలుగు నెలలు టైం ఉంది.. రూ.2వేల నోట్లు మార్చేందుకు టెన్షన్ ఎందుకు

Rs 2000 Notes

Rs 2000 Notes

Four months time: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం రూ. 2,000 నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30, 2023 వరకు బ్యాంకుల్లో నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి ప్రజలకు టైం ఇచ్చింది. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్ 30 గడువు దాటినా కూడా ఈ నోట్లు చట్టబద్ధమైన టెండర్ హోదాను పొందుతాయని పేర్కొంది. అయితే రూ.2వేల నోట్లు రద్దుతో చాలా మంది బ్యాంకులకు, ఏటీఎం సెంటర్లకు క్యూ కట్టారు. టెన్షన్‌ పడుతూ 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మరి కొందరైతే ఒక మెట్టు దాటి వాటిని కుప్పలుగా రాసులు పోసి మీమ్స్‌ చేస్తున్నారు. రెండు వేల రూపాయ నోట్స్‌ చెల్లకపోతే అంతే ఇంట్లోనే పెట్టుకుని పూజ చేయాలని కొందరు, మరికొందరైతే చెల్లని రెండు వేల నోట్లు దేనికి పనికి రాకుండా పోతాయి త్వరలో మార్చుకోండి అంటూ నానా రభస చేస్తున్నారు.

Read also: Rs 2,000 Notes: రూ.2వేల నోటు రద్దుతో సమస్య ఎవరికి ?

అయితే రెండు వేల రూపాయ నోట్లు మార్చుకునేందుకు ఎందుకంత ఓత్తిడికి గురవుతున్నారో అర్థం కావడం లేదు. మనం తెలియక చేస్తున్నామో తెలిసి చేస్తున్నామో అర్థం కావడం లేదు. చెదువుకునే వారు కూడా ఇలాంటి వార్తలు విన్నప్పుడు అందులోని మ్యాటర్‌ ను అర్థం చేసుకుంటున్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రెండు వేల రూపాయల నోట్లు రద్దైన మాట వాస్తవమే కానీ.. అది మార్చుకునేందుకు గడువుకూడా ఇచ్చారన్న సంగతి జనాలకు అర్థం కావడం లేదో లేక అర్థం చేసుకోవడం లేదో అయోమయంలో వున్నారు. అయితే రెండువేల రూపాయల నోట్లు మీ దగ్గర ఉంటే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదంటూంది ఆర్బీఐ. నోట్లు మార్చుకునేందుకు ఒకటి రెండు రోజులు కాదు నాలుగు నెలల టైం ఉంది. ఇది స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అంటే సెప్టెంబరు 30 తర్వాత ఆ రెండు వేల నోటు చెల్లదు. అంటే బయట వ్యాపారస్తులకు, లావాదేవీలకు రెండు వేల నోట్లు తీసుకోకపోవచ్చు కానీ.. బ్యాంకుల్లో మాత్రం నాలుగు నెలల్లో మార్చుకోవచ్చన్న మాట. ఆవేశాలకు పోకుండా, టెన్సన్‌ పడకుండా ఇవాళ రేపు అని కాకుండా.. రెండు వేలనోట్లు మార్చుకునేందుకు నాలుగు నెలల టైం ఉందని మాత్రం మర్చిపోకండి.

Read also: Pawan Kalyan: పవన్‌ డెడ్‌లైన్‌..! మరో నెల రోజులు వెయిట్‌ చేస్తాం..!

వాస్తవానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటి నుంచి మార్కెట్‌లో ఈ నోట్ల చెలామణి తగ్గింది. అంటే సామాన్యుల వద్ద ఈ నోట్లు లేవు. ఆ నోట్లను ముచ్చటపడి ఉంచుకున్నా.. వాటి విలువ వేలల్లో ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపదు. అంతే కాకుండా షేర్ మార్కెట్, ఆర్థిక రంగంపై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Pawan Kalyan: పవన్‌ డెడ్‌లైన్‌..! మరో నెల రోజులు వెయిట్‌ చేస్తాం..!