కేంద్ర బడ్జెట్ ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చింది. గురువారం మరోసారి రికార్డు స్థాయిలో సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ అమాంతంగా భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి. ఇక సెన్సెక్స్ అయితే 81,343, నిఫ్టీ 24, 800 పైగా మార్కు దాటి ట్రేడ్ అయ్యాయి. ముగింపులో సెన్సెక్స్ 626 పాయింట్లు లాభపడి 81, 343 దగ్గర ముగియగా.. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 24, 800 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.65 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Kakani Govardhan Reddy: వైసీపీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎక్కడ..?
నిఫ్టీలో TCS, LTIMindtree, ONGC, బజాజ్ ఫిన్‌సర్వ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గేర్‌లో దూసుకెళ్లగా… ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో నష్టపోయాయి. ఇక సెక్టార్లలో బ్యాంక్, ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం 0.3-2 శాతం పెరగగా, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, మీడియా 1-3.5 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 1 శాతం చొప్పున క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..