Site icon NTV Telugu

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. హిండన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ప్రభావం చూపించినా.. అనంతరం దాని ఎఫెక్ట్‌ అంతగా కనిపించలేదు. శుక్రవారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అదే ఒరవడి కొనసాగింది. సెన్సెక్స్ 1330 పాయింట్లు లాభపడి 80, 436 దగ్గర ముగియగా.. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24, 541 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Google storage Full: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఇలా చేయండి..?

సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్‌లు గ్రీన్‌లో ముగిశాయి, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో లాభాల్లో దూసుకుపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.7 శాతానికి పైగా పెరిగాయి. అదనంగా అన్ని రంగాల సూచీలు సానుకూలంగా సాగిపోయాయి. మొత్తానికి ఈ వారం ముగింపు మార్కెట్‌కు సరికొత్త బలాన్ని ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతు ఇస్తా.. ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version