NTV Telugu Site icon

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరిదాకా సూచీలు గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు లాభపడి 80, 802 దగ్గర ముగియగా.. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 24, 698 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Balakrishna: అక్కా చెల్లెళ్లతో బాలయ్య రాఖీ సంబరాలు

నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా లాభపడగా.. ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు బ్యాంక్, హెల్త్‌కేర్, ఐటీ, మెటల్, పవర్ 0.5-1 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: Bomb Threat: అలర్ట్.. ఈ సమయానికల్లా పేల్చేస్తాం.. ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

బీఎస్‌ఇలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, పీబీ ఫిన్‌టెక్, గ్లెన్‌మార్క్ ఫార్మా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోల్గేట్ పామోలివ్, వోల్టాస్, టెక్ మహీంద్రా, అశోక్ లేలాండ్, అరబిందో ఫార్మా, టిసిఎస్, సన్ ఫార్మా, టిసిఎస్, సన్ ఫార్మా, 280కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.