Site icon NTV Telugu

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోరుకు బ్రేకులు పడ్డాయి. గత వారం రికార్డుల మోత మోగించిన సూచీలు.. ఈ వారం మాత్రం ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం నష్టాల్లోనే సూచీలు ప్రారంభమయ్యాయి. ముగింపు దాకా అలాగే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 82, 352 దగ్గర ముగియగా.. నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 25, 198 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Delhi: రాహుల్‌గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ.. కాంగ్రెస్ టికెట్ ఖాయమా?

నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగగా.. విప్రో, కోల్ ఇండియా, ఒఎన్‌జిసి, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, ఫార్మా 0.5 శాతం చొప్పున లాభపడగా.. ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఐటి, మెటల్ 0.4-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ సూచీ స్వల్పంగా నష్టపోగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ గ్రీన్‌లో ముగిసింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan on HYDRA: హైడ్రాపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version