దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాలకు మరోసారి బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో లాభాల్లో ముగిసిన సూచీలు.. బుధవారం మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు కారణంగా నష్టాలతో ప్రారంభమైంది. చివరిదాకా నష్టాల్లోనే సూచీలు ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 81, 523 దగ్గర ముగియగా.. నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 24, 918 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.98 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు..
టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, విప్రో, ఎస్‌బీఐ, హిందాల్కో, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్.. అదానీ పోర్ట్స్, కోల్ఇండియా, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..