దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ వరుస నష్టాలను చవిచూసింది. మంగళవారం ఉదయం కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం లాభాల్లోకి దూసుకొచ్చింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 81, 634 దగ్గర ముగియగా.. నిఫ్టీ 217 పాయింట్లు లాభపడి 25, 013 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 స్థిరంగా ముగిసింది.
ఇది కూడా చదవండి: Vinesh Phogat: విజయం తర్వాత మొదటిసారి స్పందించిన వినేష్ ఫోగట్..
నిఫ్టీలో అద్దె, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎం అండ్ ఎం లాభాల్లో కొనసాగగా.. టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి. మెటల్ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, పవర్, టెలికాం, మీడియా 1-2 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: సమాజం కోసం, దేశం కోసం.. పవన్ కల్యాణ్ నిర్ణయాలు