Site icon NTV Telugu

Stock market: రికార్డులు సృష్టించి.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ 85,000 మార్కు క్రాస్ చేయగా.. నిఫ్టీ 26, 000 మార్కు క్రాస్ చేసింది. ముగింపులో మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 84, 914 దగ్గర ముగియగా.. నిఫ్టీ 1 ఒక పాయింటు నష్టపోయి 25, 940 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.66 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Siddique: రేప్ కేసులో స్టార్ యాక్టర్ పరారీ.. లుక్ అవుట్ నోటీసులు జారీ

నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, హిందాల్కో, టాటా స్టీల్ 1-4 శాతం లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి. హెల్త్‌కేర్, రియాల్టీ, ఫార్మా మరియు మీడియాతో సహా ఇతర రంగాలు కూడా సానుకూల పనితీరును కనబరిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హెచ్‌యుఎల్ మరియు ఎస్‌బిఐ లైఫ్ క్షీణతను ఎదుర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: JK Polls: రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

Exit mobile version