Site icon NTV Telugu

ప్ర‌పంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు ఎన్నున్నాయో తెలుసా?

ప్ర‌పంచంలో దాదాపుగా ఏ దేశంలో తీసుకున్నా ట్యాక్స్‌లు అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల ఆదాయంపై చాలా దేశాలు ట్యాక్స్‌ను విధిస్తు ఉంటాయి. ఇన్‌క‌మ్ ట్యాక్స్ నుంచి అనేక ర‌కాల ట్యాక్స్‌ల‌ను అక్క‌డి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వాలు ట్యాక్స్‌ల‌ను విధిస్తూ ఉంటాయి. అయితే, ప్ర‌పంచంలోని కొన్ని దేశాల్లో ఈ ట్యాక్స్‌ల గొడ‌వ ఉండ‌ద‌ట‌. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆదాయంపై ట్యాక్స్ లు విధించ‌దు. ప్ర‌భుత్వానికి ల‌భించే కీల‌క‌మైన ఆదాయం ద్వారా పాల‌న సాగిస్తుంటాయి. ప్ర‌పంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. యూఏఈ, మొనాకో, కేమ‌న్ ఐలాండ్స్‌, ఖ‌తార్‌, బ‌హ్రెయిన్‌, బెర్ముడా, కువైట్‌, బ‌హ‌మాస్‌, ఒమ‌న్‌, సెయింట్ కిట్స్‌, వ‌నాటు వంటి దేశాల్లో ఇన్‌క‌మ్ ట్యాక్స్ వంటివి ప్ర‌భుత్వం వ‌సూలు చేయ‌దు.

Read: ఇండియాలో తొలి 3డీ హౌస్‌… ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర ట్వీట్‌…

Exit mobile version