టాటాగ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాటాసన్స్ గ్రూప్ ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఎషియా, విస్తారాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియాలో టాటా సంస్థకు చెందిన విమానయాన సంస్థలు కావడంతో టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో టికెట్ బుక్ చేసుకొని అనుకోని విధంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే, అదే సమయంలో ఎయిర్ ఏషియా విమానం అందుబాటులో ఉంటే అందులో ప్రయాణం చేసేందుకు ఒప్పందం కుదరిందని టాటా కంపెనీ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా రెండు విమానాల్లో ఏ విమానం రద్దయినా ప్రయాణికుడికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పందం రెండేళ్లపాటు అంటే ఫిబ్రవరి 9,2024 వరకు వర్తిస్తుందని పేర్కొన్నది.
Read: Corbevax: దేశంలో మరో టీకా… 12 నుంచి 18 ఏళ్ల చిన్నారులకు…
