NTV Telugu Site icon

Swiggy IPO: 800 మిలియ‌న్ డాల‌ర్ల సేక‌ర‌ణే ల‌క్ష్యంగా…

భార‌త్‌లో ఫుడ్ డెల‌వ‌రి యాప్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. గ‌తేడాది ఫుడ్ డెలివ‌రి యాప్ జొమాటో సంస్థ ఐపీఓకు వ‌చ్చి భారీ స‌మీక‌ర‌ణ చేప‌ట్టింది. ఇప్పుడు ఇదే బాట‌లో స్విగ్గీ కూడా న‌డ‌వ‌బోతున్న‌ది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో స్విగ్గి ఐపీఓకు వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు రాయిట‌ర్స్ సంస్థ తెలియ‌జేసింది. ఐపీఓ ద్వారా సుమారు 800 మిలియ‌న్ డాల‌ర్లను సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. దీనికోసం స్విగ్గిలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఇండిపెండెంట్ డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించింది. అంతేకాదు, కేవ‌లం ఫుడ్ డెలివ‌రీ మాత్ర‌మే కాకుండా లాజిస్టిక్ కంపెనీగా కూడా మ‌దుప‌ర్లు ఈ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇటీవ‌లే ఈ కంపెనీలో భారీగా పెట్టుబ‌డులు రావ‌డంతో కంపెనీ విలువ 10.7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. క‌రోనా ఆంక్ష‌ల స‌మ‌యంలో ఫుడ్ డెలివ‌రీ యాప్‌ల‌కు డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే.

Read: Spy Plane: ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లంలో అమెరికా స్పై విమానాలు…