Site icon NTV Telugu

India’s SuperGaming: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సంచలనం.. రూ. 132 కోట్ల సేకరణ..!

Gaming

Gaming

India’s SuperGaming Raises: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సూపర్‌గేమింగ్ తాజా రౌండ్ నిధులలో US $15 మిలియన్లను సేకరించింది. ఈ మొత్తాన్ని భారత కరెన్సీలోకి మారుస్తే, రూ.132 కోట్లు అవుతుంది. ఈ కంపెనీ మాస్క్‌గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్‌లను తయారు చేస్తుంది. రౌండ్ నిధులు అంటే.. సంస్థ లేదా స్టార్టప్ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించే ప్రక్రియ. ఎంతో నమ్మకం ఉంటే గానీ కంపెనీల్లో జనాలు పెట్టుబడి పెట్టారు. కానీ.. కంపెనీ తాజా రౌండ్‌లో అందుకున్న ఈ నిధి విలువ నాలుగేళ్ల నాటి విలువ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. తాజాగా దాదాపు 100 మిలియన్ యూఎస్‌ డాలర్లు సేకరించింది. ఈ సమాచారాన్ని కంపెనీ ఉన్నతాధికారులు అందించారు. సూపర్ గేమింగ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రాబీ జాన్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. కంపెనీ 2021లో US$21 మిలియన్ల విలువతో US$5 మిలియన్లను సేకరించిందని చెప్పారు.

READ MORE: Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి దొరికిందిగా!

ఈ పెట్టుబడిలో స్కైక్యాచర్, స్టీడ్‌వ్యూ క్యాపిటల్ ముందంజలో ఉన్నాయి. వాటితో పాటు a16z స్పీడ్‌రన్, బందాయ్ నామ్కోకి చెందిన 021 ఫండ్, నియోవిజ్, పాలిగాన్ వెంచర్స్ వంటి వెబ్3 పెట్టుబడిదారులు ఉన్నారు. మాస్క్‌గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్‌లను తయారు చేసే సూపర్‌గేమింగ్ కంపెనీ ఈ నిధిని తమ కార్యకలాపాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించనుంది. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే సౌకర్యం లేని దేశాలలో గేమ్ డెవలపర్లు, ప్రచురణకర్తలకు సహాయం చేయడమే ఈ కంపెనీ లక్ష్యం . సూపర్ గేమింగ్ తన ప్రపంచ విస్తరణలో భాగంగా మొదట లాటిన్ అమెరికాలో తన గేమ్‌ను ప్రారంభిస్తుంది. దీని కోసం, ఇది LOUD.GGతో భాగస్వామ్యంపై పనిచేస్తోంది.

READ MORE: CM Chandrababu: మంత్రులకు సీఎం దిశానిర్దేశం.. ఇక నుంచి దూకుడు పెంచాలి..!

Exit mobile version