Site icon NTV Telugu

Stock Market: నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు..

Stock Markets Today

Stock Markets Today

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఎట్టకేలకు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపడంతో అవి ఎంతోసేపు నిలవలేదు. చూపుతున్నాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే ఊగిసలాట ధోరణిలోకి జారాయి. గతవారపు భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 10.32 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 78 పాయింట్లు నష్టపోయి 51,281 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 పాయింట్లు పతనమై 15,258 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్, విప్రో, టీసీఎస్‌, మారుతీ, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్‌ క్యాప్‌ 1.62, స్మాల్‌ క్యాప్‌ 1.86 శాతం పోడిపోయాయి. సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ బ్యాంక్ 0.54, నిఫ్టీ ఐటీ 0.54 శాతం తగ్గాయి. ముఖ్యంగా ఆయిల్‌, మెటల్‌ స్టాక్‌ల్లో పతనం కొనసాగుతోంది. వేదాంత షేరు 6 శాతం పడిపోయింది.

శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు పతనమై 51,360.42 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 15,293.50 వద్ద స్థిరపడింది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లలో నమోదైన ఈ-ముద్ర మార్చి 2022తో ముగిసిన త్రైమాసికపు లాభాల్లో 62.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Exit mobile version