NTV Telugu Site icon

Stock Market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒక్కరోజు లాభాలకు బ్రేక్ పడింది. గత ఎనిమిది రోజులుగా భారీ నష్టాలు చవిచూడగా సోమవారం కాస్త ఊరట లభించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి నష్టాలను ఎదుర్కొంది. మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 75, 967 దగ్గర ముగియగా.. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22, 945 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 7 పైసలు తగ్గి 86.94 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: AAI Recruitment 2025: లైఫ్ సెట్ చేసే జాబ్స్.. ఎయిర్ పోర్ట్ అథారిటీలో భారీగా జాబ్స్.. నెలకు రూ. 1.4 లక్షల జీతం

నిఫ్టీలో ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధికంగా నష్టపోగా.. టెక్ మహీంద్రా, విప్రో, ఒఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ లాభాలను ఆర్జించాయి.

ఇది కూడా చదవండి: SKN: తెలుగు హీరోయిన్ల గురించి సరదాగా అన్నా.. వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్