దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో ఈ వారమంతా ఇలానే ట్రేడ్ అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 985 పాయింట్లు నష్టపోయి 73, 627 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 307 పాయింట్లు నష్టపోయి 22, 237 దగ్గర కొనసాగుతోంది.
ఇక అన్ని రంగాల సూచీలు ఐటీ, ఆటో, మీడియా, టెలికాం 2-3 శాతం పడిపోయాయి. నిఫ్టీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ప్రధాన నష్టాల్లో ఉండగా.. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం తగ్గాయి.
ఇది కూడా చదవండి: Realme P3x: నమ్మలేని ఫీచర్స్‌ను బడ్జెట్ రేంజ్‌లోకి తీసుకొచ్చిన రియల్‌మి