NTV Telugu Site icon

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. మంగళవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి నష్టాల్లో ముగిశాయి. సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. మంగళవారం అదే ఒరవడి కొనసాగుతుందని ఇన్వెస్టర్లు భావించారు. కానీ ఆసియా-పసిఫిక్ మార్కెట్‌లోని సానుకూలతలు మన మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. కానీ చివరిలో మాత్రం నిరాశ పరిచింది. సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 78, 593 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 23, 992 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 83.95 దగ్గర రికార్డ్ స్థాయి దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: UK Violence: యూకేలో హింస.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఎస్‌బీఐ నష్టపోగా… బ్రిటానియా ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌యుఎల్, ఎల్ అండ్ టి మరియు టెక్ మహీంద్రా లాభపడ్డాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 శాతం చొప్పున క్షీణించగా.. ఐటీ, మెటల్, రియాల్టీ 0.3-0.8 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: వరల్డ్ నెం.1 రెజ్లర్కు షాకిచ్చిన వినేష్ ఫోగట్..