NTV Telugu Site icon

Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఒడుదుడుకులు ఉండడంతో మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే కొనసాగాయి. ముగింపులో మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోయి 80, 065 దగ్గర ముగియగా.. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 24, 399 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.07 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: BJP: కాంగ్రెస్ ఖర్గేని అవమానించింది.. సోనియా, రాహుల్‌పై బీజేపీ ఫైర్..

నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్ లాభపడగా… హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ లైఫ్, హిందాల్కో, నెస్లే, బజాజ్ ఆటో భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76.49 డాలర్లుగా ఉండగా.. బంగారం ఔన్సు 2,749 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Baby Boy Sale: రూ.లక్ష కోసం కన్నబిడ్డను అమ్మేసిన తల్లి