Site icon NTV Telugu

Stock market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనం అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. ముగింపులో మాత్రం లాభాలు ఆవిరైపోయాయి. ఇక మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80, 220 దగ్గర ముగియగా.. నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24, 472 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.07 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: J-K: చైనా కోసమే కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి

నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎం అండ్ ఎం, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ భారీ నష్టాల్లో కొనసాగగా.. ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియాల్టీ, టెలికాం, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌లతో అన్ని రంగాల సూచీలు 2-3 శాతం నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.8 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Jagapathi Babu: ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతిబాబు సంచలనం

Exit mobile version