NTV Telugu Site icon

Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌ను ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధ భయం వెంటాడుతోంది. గత వారం సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. దీంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారమైనా మార్కెట్ కుదిట పడుతుందనుకుంటే.. అదే భయాందోళన కొనసాగింది. దీంతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా రెడ్‌లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74, 454 దగ్గర ముగియగా.. నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 22, 553 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.70 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

ఇది కూడా చదవండి: Minister Anagani: జగన్కి కావాల్సింది ప్రతిపక్ష హోదానే.. ప్రజా సమస్యలు కాదు..

నిఫ్టీలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్ అత్యధికంగా నష్టపోగా.. ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం తగ్గాయి.

ఇది కూడా చదవండి: Arabian Mandi : ఫ్రిడ్జ్‌లో బొద్దింకలు.. అపరిశుభ్రంగా కిచెన్ పరిసరాలు.. తనిఖీల్లో బయటపడ్డ బాగోతం