NTV Telugu Site icon

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కారణంగా శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో భారీ నష్టాలతో ముగిసింది. ట్రంప్ నిర్ణయాలు కారణంగా ఈ వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 424 పాయింట్లు నష్టపోయి 75, 311 దగ్గర ముగియగా.. నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 22, 795 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!

ప్రధాన సూచీలలో 12 రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్ మాత్రమే 1 శాతానికి పైగా లాభపడింది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 110 శాతం నుంచి 15 శాతానికి తగ్గించే అవకాశం ఉందనే నివేదికల మధ్య నిఫ్టీ ఆటో 2.5 శాతం పడిపోయింది. ఇక టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది.

ఇది కూడా చదవండి: Union Bank : బ్యాంక్ జాబ్ కావాలా?.. 2691 పోస్టులు రెడీ.. ఇక వద్దన్నా జాబ్