దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా ఎన్నికల అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తలు కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది. దాదాపుగా 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మంగళవారం కూడా నష్టాలతోనే సూచీలు ప్రారంభమయ్యాయి. కానీ క్రమక్రమంగా పుంజుకుంటూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 79, 476 దగ్గర ముగియగా.. నిఫ్టీ 217 పాయింట్లు లాభపడి 24, 213 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.10 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: RK Roja: మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ భారీ లాభాల్లో కొనసాగగా.. కోల్ ఇండియా, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ మరియు ఐటీసీ నష్టపోయాయి. ఎఫ్‌ఎమ్‌సిజి, మీడియా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు బ్యాంక్, మెటల్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ 1-2 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం చొప్పున పెరిగాయి.
ఇది కూడా చదవండి: Wedding Season: వచ్చే నెల రోజుల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. రూ.6 లక్షల కోట్ల వ్యాపారం..