NTV Telugu Site icon

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణంగా మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. ఇక ముగింపులో సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 74, 602 దగ్గర ముగియగా.. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 22, 547 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.20 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి

నిఫ్టీలో ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి మరియు నెస్లే ప్రధాన లాభాలను ఆర్జించగా.. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ట్రెంట్ నష్టపోయాయి. రంగాల పరంగా.. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ 0.5-1 శాతం తగ్గాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం 0.5 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పడిపోయాయి. ఇదిలా ఉంటే మహాశివరాత్రి కారణంగా ఫిబ్రవరి 26న మార్కెట్ మూసివేయబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Belly Fat: బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఈ ‘టీ’లు తాగాల్సిందే!