దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 74, 612 దగ్గర ముగియగా.. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయ 22, 545 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.19 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్కు ఆమోదం తెలిపే ఛాన్స్!
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో మరియు హీరో మోటోకార్ప్ నష్టపోయాయి. బ్యాంక్ మరియు మెటల్ మినహా.. ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, మీడియా, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ, పవర్ 1-3 శాతం క్షీణించి రెడ్‌లో ముగిశాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం తగ్గింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం పడిపోయాయి.
ఇది కూడా చదవండి: Shikhar Dhawan: ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు నెగ్గాలో.. రోహిత్‌కు బాగా తెలుసు