NTV Telugu Site icon

Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. గత వారం సూచీలు రికార్డుల జోరు సాగించగా.. ఈ వారం మాత్రం రివర్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 82, 201 దగ్గర ముగియగా.. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 25, 145 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83. 97 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Bangladesh: హసీనా సైలెంట్‌గా ఉండాలి లేకపోతే ఆమెకి, భారత్‌కి మంచిది కాదు.. బంగ్లా చీఫ్ వార్నింగ్..

నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, విప్రో, బిపిసిఎల్, ఐటిసి లాభపడగా… కోల్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, రియాల్టీలో అమ్మకాలు కనిపించగా.. మెటల్, ఐటీ, టెలికాం మరియు మీడియాలో కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: Sai Pallavi Sister: సాయి పల్లవి చెల్లి పెళ్లి.. ఫోటోలు వైరల్